హన్మకొండ : బీజేపీ, కాంగ్రెస్ రెండు బ్లాక్మెయిల్ పార్టీలేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మంగళవారం హనుమకొండ లోని సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీలో బ్లాక్మెయిల్ బెదిరింపులతో మోదీ గెలిచాడని, చంద్రబాబు, నితీష్ లేకపోతే మళ్లీ మోదీ అధికారం చేపట్టేవాడు కాదన్నారు. కార్పొరేట్ శక్తులకు మోదీ కొమ్ముకాస్తున్నాడని విమర్శించారు. రాజకీయ వ్యక్తులను కార్పొరేట్ దిగ్గజాలు శాసిస్తున్నాయన్నారు. ప్రపంచంలోనే భారతదేశం అత్యుత్తమైందన్నారు.
అనేక వనరులు ఈ నేలలో ఉన్నాయని పేర్కొన్నారు. మోదీ దుర్మార్గమైన చర్యలు చేపడుతున్నాడని వ్యవస్థ మొత్తం నాశనం చేస్తున్నాడని విమర్శించారు. హిందూ మతతత్వ ముస్కులో ప్రజలను రెచ్చగొడు తున్నాడని ఆరోపించారు. మోదీ, అదాని, ట్రంపుకు మద్దతు తెలుపుతున్నారని మండిపడ్డారు. కమ్యూనిస్టు పార్టీకి వందేళ్ల చరిత్ర ఉంది. ప్రజల పక్షాన అండగా ఉండి సమస్యల పరిష్కారానికి నిత్యం పోరాడు తుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు భిక్షపతి పాల్గొన్నారు.