సుబేదారి (వరంగల్), జూన్ 26 : డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పిలుపు నిచ్చారు. ప్రపంచ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకోని వరంగల్ పోలీసు కమినరేట్ అధ్వర్యంలో వరంగల్ నగరం లో 2కె రన్ నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయము నుండి సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం వరకు 2కె రన్ కోనసాగింది. ఈ పరుగులో ప్రతిభ కబరిచిన యువతకు ముఖ్య అతిధిల చేతుల మీదుగా పతకాలు, సర్టిఫికేట్లను అందజేశారు.
ఈ సందర్బంగా సన్ ప్రీత్ సింగ్ మాట్లాడారు మాదకద్రవ్యాల సంబంధించి ప్రస్తుత సమాజంలో పెద్ద సమస్యగా మారిందని, యువత, విద్యార్థులు మాదకద్రవ్యాల జోలికి పోవద్దని, ఒక్కసారి వాటిని వినియోగించడం ద్వారా యువత జీవితాలు అంధకారం మారుతాయని అన్నారు. ముఖ్యంగా మత్తు పదార్థాలను విక్రయాలు, వినియోగించడంలాంటి చర్యలకు పాల్పడి చిక్కుల్లో పడొద్దని, విద్యార్థులు కేవలం చదువులపైనే దృష్టి పెట్టాలని, అదే విధంగా యువత తమ ఉన్నంత లక్ష్య సాధనకై కృషి చేయాలని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమములో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కే.ఆర్ నాగరాజు, టీజీ ఎన్పిడిసిఎల్ ఎండీ వరుణ్ రెడ్డి, వరంగల్, హన్మకొండ కలెక్టర్లు డా.సత్యశారద, చాహత్ బాజ్‌పాయి, కుడా చైర్మన్ ఇనగాల వెంట్రామిరెడ్డి, డీసీపీలు దార కవిత, అంకిత్‌కుమార్, అడిషినల్ కలెక్టర్ సంధ్య తదితరులు పాల్గొన్నారు.