భీమదేవరపల్లి, మార్చి 07: రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) పై బీజేపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షుడు ఊసకోయిల ప్రకాష్ హెచ్చరించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు కరీంనగర్ జిల్లాకు గాని, హుస్నాబాద్ నియోజకవర్గానికి గానీ ఎన్ని నిధులు తీసుకు వచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకానీ ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామని, తెలంగాణ కోసం పోరాటం చేసిన పొన్నం ప్రభాకర్ పై వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదన్నారు.
ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమన్నారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడాలన్నారు. కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. రాష్ట్ర మంత్రిగా పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు ఘనవేని కొమురయ్య, బొల్లంపల్లి రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిట్టంపెల్లి ఐలయ్య, నాయకులు గజ్జెల రమేష్, జక్కుల అనిల్, చిట్కూరి రామచంద్రం, ఎదులాపురం తిరుపతి, గొల్లపల్లి రవీందర్, భాష, తాళ్ల అరవింద్, సయ్యద్ భాష , గాడిపల్లి హరీష్, తదితరులు పాల్గొన్నారు.