మహిళల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమని, మహిళలు పారిశ్రామికంగా, ఆర్థికంగా ఎదగాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం పాలకుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని మహిళా సంఘాలకు రూ.5కోట్ల రుణాల చెక్కును అందజేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో మహిళా సంఘాలను బలోపేతం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. సీఎం కేసీఆర్ మహిళల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. వారి ఆర్థికాభివృద్ధికి స్త్రీనిధి, పావలావడ్డీ, అభయహస్తం, సంక్షేమానికి అమ్మ ఒడి, న్యూట్రిషన్ కిట్, 102, కేసీఆర్ కిట్‌తోపాటు ఆడబిడ్డలను ఆదుకునేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. పాపాల కాంగ్రెస్, మోసాల బీజేపీ నాయకుల మాటలను ప్రజలు నమ్మొద్దని, ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు, తనకు మహిళలు అండగా నిలువాలని కోరారు.
పాలకుర్తి రూరల్, ఆగస్టు 24: మహిళలు పారిశ్రామికంగా, ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీ ఆర్ లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిసరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్లో పాలకుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని మహిళా రూ.5కోట్ల రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంఘాలను బలోపేతం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. ఆడబిడ్డలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితేనే దేశం బాగుపడుతుందని, మహిళలు ఆర్థికంగా బలోపేతమైతే కుటుంబం అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం కేసీఆర్ మహిళా సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. స్త్రీ నిధి, పావలా వడ్డీ, అభయ హస్తం వంటి పథకాలను ప్రవేశపెట్టినట్లు వివరించారు. కల్యాణలక్ష్మి, షాదీముదారక్ పథకాలు ప్రవేశపెట్టారని, అమ్మ ఒడి, న్యూట్రిషన్ కిట్, 102, కేసీఆర్ కిట్ వంటి పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లోనే ఉచితంగా ప్రసవాలు జరుగుతున్నాయని చెప్పారు. పాపాల కాంగ్రెస్, మోసాల బీజేపీ నాయకుల మాటలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ నాయకులు ఓట్ల జోకర్లు అని ఎద్దేవా చేశారు. ఉచిత విద్యుత్‌పై రేవంత్‌రెడ్డి మాటలు హాస్యాస్పదమన్నారు. ఎకరానికి గంట చాలని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఓట్ల వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మహిళలకు పథకాలు లేవని, మహిళా సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు, మహిళలు అండగా నిలువాలని కోరారు. అనంతరం ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా సంఘాల బలోపేతానికి సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విశేషంగా కృషి చేస్తున్నారన్నారు.
పాలకుర్తి మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, పలువురు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సింగారం ప్రభాకర్, ఈర్ల రవి, గాదరి వేణు, పర్శరాములు, మట్ట రవి, బక్క నర్సయ్య, మహేందర్ బీఆర్ఎస్లో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. ఎస్బీఐ ఆర్ఎం ఎస్కే అబ్దుల్ రహీం, ఏపీడీ ఎండీ నూరోద్దీన్, నరేందర్, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, సర్పంచ్ వీరమనేని యాకాంతారావు, ఎఫ్ఎస్సీఎస్ బ్యాంక్ చైర్మన్ బొబ్బల జిల్లా మహిళా అధ్యక్షురాలు గిరగాని సుధ, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముస్కు రాంబాబు, ఈర్ల రాజు, సీసీ వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య పాల్గొన్నారు.