Nekkonda | వర్షాలకు అనుగుణంగా రైతులు పంటలను సాగు చేయాలి : కలెక్టర్ సత్య శారద
ప్రస్తుతం నేను ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని అవకాశం ఉన్నందున వర్షాలను అనుసరిస్తూ రైతులు పంటల సాగు ప్రణాళికలు రూపొందించుకొని పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు.
నెక్కొండ, జూన్ 8 : ప్రస్తుతం నేను ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని అవకాశం ఉన్నందున వర్షాలను అనుసరిస్తూ రైతులు పంటల సాగు ప్రణాళికలు రూపొందించుకొని పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ గ్రామ సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ మాట్లాడుతూ వర్షాలు సరిగా పడకపోతే జూలై నెల వరకు పరిస్థితిని గమనించి తక్కువ సాగునీటితో పండించే పంటల సాగు వైపు రైతులు మొగ్గు చూపాలన్నారు.
అధిక నీటి అవసరం ఉండే వరి పంటకు బదులుగా రైతులు తక్కువ నీటితో సాగయ్యే పప్పు ధాన్యాల పంటలను సాగు చేస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుందన్నారు. వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రణాళికలకు అనుగుణంగా పంటలను సాగు చేపడితే రైతులు నష్టాలను తగ్గించుకొని మెరుగైన ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు. సేంద్రియ వ్యవసాయంతో భూమి ఆరోగ్యం మెరుగు పడడమే కాకుండా ప్రజల ఆరోగ్యం పరిరక్షించబడుతుందన్నారు. కార్యక్రమంలో సీఈవో రామ్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, ఎంపీడీవో లావణ్య, ఎస్ఐ మహేందర్, ఏవో నాగరాజు, పంచాయతీ కార్యదర్శి సదానందం పాల్గొన్నారు
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

