ధర్మసాగర్ : విద్యతోనే జీవితంలో ఉన్నతస్థాయి కి చేరుకోగలమని హనుమకొండ జిల్లా ధర్మసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రావు సూచించారు. బుధవారం ధర్మసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ అస్నాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన వార్షికోత్సవం సమావేశానికి సీఐ శ్రీధర్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చదువు వల్ల మనిషికి విలువ పెరుగుతుందని, విలువలతో జీవితాన్ని కొనసాగించడమే సార్థకమని అన్నారు. ఆధునిక కాలంలో సాంకేతికత ఎంత పెరుగుతుందో దాని చేడు ప్రభావాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయని అన్నారు.
విద్యార్థులు సాంకేతిక విజ్ఞానాన్ని మానవ వికాసానికి ఉపయోగించి ఆదర్శంగా ఉండాలని సూచించారు. అనంతరం వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మాచర్ల జ్యోతి, పెద్దపెండ్యాల గ్రామ సర్పంచ్ తోట నాగరాజు, అధ్యాపకులు మంజుల, బాబూరావు, రాములు, గణేష్, గోపాలకృష్ణ, సదానందం, ప్రభాకర్, రాజేందర్, రవళి, వేణు, యాకుబ్ అలీ, చంద్రమౌళి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.