Wardannapeta | డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం : సీఐ ప్రవీణ్ కుమార్
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం అని నార్కోటిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
వర్ధన్నపేట, మార్చి 10 : డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం అని నార్కోటిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద, కట్య్రాల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, డ్రగ్స్ నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో కేవలం అభివృద్ధి పనులే కాకుండా, రేపటి పౌరులైన విద్యార్థుల భవిష్యత్తును కాపాడటం మా బాధ్యత అన్నారు.
గ్రామాలలోని ప్రతి పాఠశాల డ్రగ్స్ రహితంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు అలవాటుపడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. ఎవరైనా మత్తుపదార్థాలు తీసుకున్నా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎస్ఐ సాయిబాబు, సర్పంచ్ బేతి సాంబయ్య, ఉప సర్పంచ్ బొచ్చు జ్యోతి, కార్యదర్శి రామారావు, డాక్టర్ సురేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

