మహబూబాబాద్ రూరల్ : విత్తన డీలర్లు నకిలీ విత్తనాలను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని టౌన్ సీఐ పెండ్యాల దీవెందర్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను వ్యవసాయ అధికారులతో కలిసి తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ దేవేందర్ మాట్లాడుతూ లైసెన్స్ కలిగిన ఫస్టిలైజర్ దుకాణదారులు తప్పనిసరిగా రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులను అందించాలని సూచించారు.
అనంతరం దుకాణాలలోని స్టాకును పరిశీలించారు రైతులకు అమ్మకం చేసిన తర్వాత వెంటనే రసీదులను అందించాలన్నారు. దుకాణాలలో ఎలాంటి అవకతవకలు జరిగిన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏవో తిరుపతిరెడ్డి, తాసిల్దార్ రాజేశ్వర్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.