హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 23 : హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌కాలేజీలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య తిథిగా హాజరైన కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి క్రిస్మస్ కేకును కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీసస్ క్రీస్తు బోధనలు సమాజంలో ప్రేమ, శాంతి, ఐక్యత భావాలను పెంపొందించేలా ఉంటాయన్నారు.
ఇలాంటి వేడుకలు విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మధ్య స్నేహభావాన్ని మరింత బలపరుస్తాయన్నారు. వైస్ ప్రిన్సిపల్ రెహమాన్, ఫ్యాకల్టీ క్లబ్ చైర్మన్ కర్ణాకర్‌రావు, ప్రసాద్, శ్రీధర్ లోథ్కుమార్, శేషు, చింతం ప్రవీణ్‌కుమార్, బిక్షపతి, సత్యమ్మ, బోధనేతర సంఘం నాయకులు సుశీల్, సుమన్, అనురాగ్ పాల్గొన్నారు.