చెన్నారావుపేట : వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల ఎన్నికల కన్వీనర్ జక్క అశోక్ తండ్రి, జల్లి గ్రామ మాజీ సర్పంచ్ జక్క కొమురయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా, బీర్ఎస్ మండల అధ్యక్షుడు బాల్నే వెంకన్న ఆధ్వర్యంలో శుక్రవారం జక్క కొమురయ్య చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. కొమురయ్య కుటుంబీకులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పత్తి నాయక్, పిఎసిఎస్ చైర్మన్ మురారి రవి, మండల అధికార ప్రతినిధి కృష్ణ చైతన్య రెడ్డి, బోడ బద్ధు నాయక్, జిన్నుతుల మహేందర్రెడ్డి, అనుముల కుమారస్వామి, కొండవీటి ప్రదీప్ కుమార్, భూక్య రవీందర్, మాజీ కోఆప్షన్ సభ్యులు రఫీ, ఉపాధ్యక్షులు కుసుమ నరేందర్, యూత్ అధ్యక్షులు మంచోజు మనోజ్, మాజీ సర్పంచ్ కుండ మల్లయ్య, హంస విజయరామరాజు, ఆంధ్ర బాలాజీ, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.