నల్లబెల్లి, జూన్ 03 : గోవుల అక్రమ రవాణా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నల్లబెల్లి పోలీస్ స్టేషన్ లో బిజెపి శ్రేణులు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బక్రీద్ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల నుండి గోవుల అక్రమ రవాణా దారులు ఇతర ప్రాంతాలకు గుట్టుచప్పుడు కాకుండా రాత్రివేళ గోవులను తరలిస్తున్నారని అన్నారు. గోమాత అక్రమ రవాణా, గోవధ చేసే వారిని కఠినంగా శిక్షించాలన్నారు.
మండలం పరిధిలో బక్రీద్ సందర్భంగా గోవధ, గో అక్రమ రవాణా చేసే వారిని గుర్తించి గోవధ జరగకుండా నివారించాలని మండల పరిధి వివిధ గ్రామాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి గోవుల అక్రమ రవాణాలను నివారించవలసిందిగా పోలీస్ శాఖను కోరారు. కార్యక్రమంలో మండల ప్రధానకార్యదర్శి ఈర్ల నాగరాజు, మండల కోశాధికారి మురికి మనోహర్, వల్లే పార్వతలు, కొండ్లె రమేష్, కౌడగాని రాజేందర్, ఈర్ల నాగరాజు, యువమోర్చ నాయకులు తిమ్మాపురం శివ పాల్గొన్నారు.