Congress party | ఐనవోలు, హనుమకొండ : బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ ప్రదర్శిస్తుందని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు మాదాసు ప్రణయ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ తరుపున బీసీ బిడ్డ అయిన సీపీ రాధాకృష్ణన్‌ను ప్రకటిచింది. అదే ఇండియాకూటమి మాత్రం బీసీని కాకుండా ఓసీ అభ్యర్థిని ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీ బీసీల రిజర్వేషన్లలో ఢీల్లీలో ఒక మాట.. గల్లీలో ఒక మాట మాట్లాడుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి బీసీ రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధి ఉంటే.. అత్యున్నతమైన ఉపరాష్ట్రపతి పదవి ఒక బీసీ బిడ్డకు పోటీగా ఓసీ అభ్యర్థిని ప్రకటించిందంటే బీసీల పట్ల కాంగ్రెస్‌కు ఉన్న కపట ప్రేమకు నిదర్శనం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల పేరుతో నాటకాలు ఆడుతుందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శులు పొన్నాల రాజు, మడ్డి రవితేజ, విక్రమ్, వెంకటేశ్ తదితరులు ఉన్నారు.
Constitution Amendment Bill: పోలీసు రాజ్యంగా మారుస్తున్నారు : విపక్షాల ఆరోపణ
Rajapeta : రాజాపేట చెరువుల్లోకి చుక్కనీరు రాలే
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని రైతుల ధర్నా