Hanumakonda Bus Stand | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 3 : మీరు ఈ రోడ్డు గుండా వెళ్తున్నారా..? అయితే చాలా జాగ్రత్తగా వెళ్లండి.. కొంచెం ఆదమరిస్తే అంతే సంగతులు.. గుంతలో పడిపోవడం ఖాయం. ఇంతకీ ఎక్కడనుకుంటున్నారా..? హనుమకొండ బస్‌స్టేషన్ రోడ్లో ఈ పరిస్థితి నెలకొంది.
ఈ రోడ్డు వెంట వెళ్లాల్సి వస్తే జరభద్రంగా ప్రయాణించండి.. ఆదమరిచారో అంతే సంగతులు.. నిత్యం వేలాది మంది ప్రయాణించే ప్రధాన రహదారిపై గుంతలు పడి ప్రమాదకరంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షానికి రోడ్డు కొట్టుకుపోయినా భారీగా గుంత ఏర్పడింది.
కంకరతేలి ప్రమాదకరంగా మారడంతో గమనించిన పండ్ల వ్యాపారాలు డబ్బా, ఎర్రజెండాతో కర్రలు ఏర్పాటు చేశారు. ఇది గమనించని వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. స్పీడ్‌గా వచ్చిన వాహనదారులు ఒక్కసారిగా గుంత గమనించడంతో ఒకదానివెనుక ఒకటి వాహనాలు ఢీకొన్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఎలాంటి ప్రమాదాలు జరగముందే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వెంటనే గుంతను పూడ్చాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.

Penpahad : సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి : ఎస్ఐ గోపికృష్ణ
Hanumakonda | వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామికి ‘లక్ష తులసీ దళార్చన’