మహేష్‌బాబు ఫ్యాన్స్‌కు క్షమాపణలు
అగ్ర దర్శకుడు హరీశ్‌శంకర్ ఎక్స్ ఖాతాలో చేసిన ఒక రీ ట్వీట్ ఆయన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. హరీశ్‌శంకర్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ‘ఉస్తాద్ భగత్‌సింగ్' చిత్రం ఈ నెల 19న రిలీజ్‌కానుంది.
అగ్ర దర్శకుడు హరీశ్‌శంకర్ ఎక్స్ ఖాతాలో చేసిన ఒక రీ ట్వీట్ ఆయన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. హరీశ్‌శంకర్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రం ఈ నెల 19న రిలీజ్‌కానుంది. ఈ నేపథ్యంలో ఓ అభిమాని “ఉస్తాద్ భగత్‌సింగ్’తో మహేష్‌బాబు రికార్డులన్నీ చెరిగిపోవాలి’ అనే అర్థంలో ట్వీట్ చేశారు. దీనికి ‘తథాస్తు’ అంటూ రీ ట్వీట్ చేశారు హరీశ్‌శంకర్. ఇది సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
దీనిపై మహేష్‌బాబు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హరీశ్‌శంకర్ బుధవారం ఓ ప్రెస్‌నోట్ ద్వారా క్షమాపణలు తెలియజేశారు. పని ఒత్తిడిలో ఉన్నందువల్ల ట్వీట్‌ను పూర్తిగా చదవకుండానే పొరపాటున రిైప్లె ఇచ్చానని, తన టీమ్ అప్రమత్తమై దానిని వెంటనే తొలగించిందని వివరణ ఇచ్చారు. మహేష్‌బాబు అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, అనుకోకుండా జరిగిన పొరపాటు వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రాన్ని అందరూ ఆదరించాలని హరీశ్‌శంకర్ విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

