పాటలో ఏదో ఛమక్కు ఉండాలి!
‘పల్లె భాషను నమ్ముకొని పరిశ్రమకు వచ్చాను. మరుగున పడిన మాండలికం నా పాట ద్వారా మళ్లీ వెలుగులోకి రావడం ఆనందంగా ఉంది. నేటి యువత కూడా ఆ పదాల గురించి తెలుసుకోవడం రచయితగా సంతృప్తినిస్తున్నది’ అన్నారు ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్.
‘పల్లె భాషను నమ్ముకొని పరిశ్రమకు వచ్చాను. మరుగున పడిన మాండలికం నా పాట ద్వారా మళ్లీ వెలుగులోకి రావడం ఆనందంగా ఉంది. నేటి యువత కూడా ఆ పదాల గురించి తెలుసుకోవడం రచయితగా సంతృప్తినిస్తున్నది’ అన్నారు ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్. గత ఏడాది ‘బలగం’ చిత్రంలోని పాటకుగాను ఉత్తమ గేయ రచయితగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్న ఆయన.. ప్రస్తుతం భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. నాని ‘ది ప్యారడైజ్’ చిత్రంలో ఆయన రాసిన ‘ఆయా షేర్’ పాటకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ఈ నేపథ్యంలో బుధవారం గీత రచయిత కాసర్ల శ్యామ్ విలేకరులతో ఆ పాట తాలూకు విశేషాలను పంచుకున్నారు.
- నా కెరీర్లో ఇంత కిక్ ఇచ్చిన పాట మరోటి లేదు. ఈ పాటలో నేను ఉపయోగించిన అచ్చ తెలంగాణ మాండలికం అద్భుతమని ప్రశంసలొస్తున్నాయి. ఈ పాట విని స్ఫూర్తి పొందామని, నిరాశపూరితమైన భావన నుంచి బయటపడి ఆశావహదృక్పథాన్ని అలవరచుకున్నామని చాలా మంది మెసేజ్ చేయడం ఆనందంగా ఉంది.
- ఈ పాట రాయడానికి వారం రోజులు పట్టింది. దర్శకుడు శ్రీకాంత్ నాకు ఈ కథ తాలూకు ప్రపంచాన్ని మొత్తం కళ్లముందుంచాడు. నాని పోషించిన జడల్ పాత్రలోని ఉద్వేగాల తీవ్రత గురించి వివరించాడు. వివక్ష, అణచివేతను ఎదుర్కొన్న ఓ జాతి నుంచి వీరుడు పుట్టే క్రమంలో ఈ పాట వస్తుంది.
- తెలంగాణ మాండలికంలో పాటంటే నా పేరే గుర్తుకు రావడం చాలా ఆనందంగా ఉంది. నేను పుట్టి పెరిగిన వరంగల్ ప్రాంతంలోని కళా వాతావరణం, అక్కడి సాహిత్య ప్రముఖుల స్ఫూర్తితో నేను ముందుకుసాగుతున్నా. ఏ పాట రాసినా అందులో ఏదో తెలియని ఛమక్కు ఉండాలనుకుంటా. నా పాటల్ని పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ‘ఆయా షేర్’ పాట చేస్తున్నప్పుడే సంగీత దర్శకుడు అనిరుధ్ ‘మనం పెద్ద హిట్ కొట్టబోతున్నాం’ అని చెప్పారు. హీరో నాని కూడా ఈ పాట విని ‘నాకు లైఫ్‌లాంగ్ సరిపోయే కిక్ ఇచ్చారు’ అని మెచ్చుకున్నారు. వారిద్దరి ప్రశంసలు ఉత్సాహాన్నిచ్చాయి.
- మన పల్లెభాషను, ప్రాంతాన్ని ప్రేమిస్తే అదే మనల్ని అంతర్జాతీయ వేదికల మీద నిలబెడుతుందన్నది నా నమ్మకం. గీత రచనలో ఇదే సూత్రాన్ని పాటిస్తా. నేను పాటలు రాసిన తాజా చిత్రాలు లెనిన్, మా ఇంటి బంగారం, ఉస్తాద్ భగత్‌సింగ్ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని చిత్రాల తాలూకు చర్చలు జరుగుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

