Aruri Ramesh | ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి : ఆరూరి రమేశ్
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
న్యూశాయంపేట, మే 5 : అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హంటర్‌రోడ్ క్యాంపు కార్యాలయంలో వర్ధన్నపేట నియోజకవర్గం గ్రేటర్ వరంగల్ 46వ డివిజన్ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమీక్షా సమావేశం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరూరి రమేశ్ మాట్లాడుతూ రానున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించి గులాబీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలను కోరారు.
భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీ దేనని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు. కార్యకర్తలకు ఎల్లప్పుడు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం బుధవారం ఉదయం 9 గంటలకు హంటర్‌రోడ్‌లోని సీఎస్ఆర్ గార్డెన్ సర్కిల్ వద్ద నిర్వహించబోయే రైతు సంగ్రామ సదస్సుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్న సందర్భంగా రైతు సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో 46వ డివిజన్ కార్పొరేటర్ మునిగాల సరోజన, హనుమకొండ జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షురాలు ఎల్లావుల లలితాయాదవ్, మాజీ డివిజన్ అధ్యక్షులు వినోద్‌కుమార్, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

