హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 4: నేటి సమాజంలో మనిషి తీసుకునే ఇంటి బయట తీసుకునే ఆహార పదార్థాలు, చిరు తిను బొండారాలు, కలుషితం అవుతుండడం వలన వాటిని మనం వాడడం ద్వారా క్యాన్సర్‌కు దారి తీస్తుందని గెస్ట్ లెక్చర్ ప్రొఫెసర్ జి.రామేశ్వరం అన్నారు. సైకాలజీ విభాగాధిపతి, కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం అధ్యక్షతన జరిగిన ఒకరోజు సెమినార్లో రామేశ్వరం మాట్లాడారు.
. సమాజం ప్రకృతి తిను బాండారాలపై మక్కువ చూపాలని మార్కెట్లో దొరికే పానీయాలు, బేకరీ ఫుడ్‌కు స్వస్తి చెప్పాలన్నారు. ఇప్పుడు ఉన్న సమయంలో క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్లు భయపడాల్సిన భయం లేదని ఆరోగ్యపరంగా వైద్య విధానం ఉన్నదని గుర్తుచేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు జి.సంపత్‌రెడ్డి, పి.మాలతి, విద్యార్థులు పాల్గొన్నారు.