వేలేరు, మే 31 : హనుమకొండ జిల్లా వేలేరు మండల పరిధిలోని ఎరువులు, విత్తనాల దుకాణాలపై టాస్క్‌ఫోర్స్, వ్యవసాయ అధికారులు, పోలీసులు తనిఖీలు చేపట్టారు. వేలేరు మండల వ్యవసాయ అధికారి కవిత, టాస్క్‌ఫోర్స్ ఏడీఏ రాజ్‌కుమార్, ఏవో సంతోశ్, వేలేరు ఎస్సై సురేశ్‌లు శనివారం నాడు తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా దుకాణాల్లో ఉన్న ఎరువులు, విత్తనాల స్టాక్‌ను అధికారులు పరిశీలించారు. అలాగే డీలర్ల లైసెన్సులు, లేబులింగ్, స్టాక్లను పరిశీలించారు. డీలర్లు, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలని సూచించారు. ఎరువులు, విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.