హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 31: జనవరి 3,4,5 తేదీల్లో శంషాబాద్లో జరిగే ఏబీవీపీ రాష్ర్ట మహాసభలను విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అంబాల కిరణ్ పిలుపునిచ్చారు. కేయూ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో కేయూ పరిపాలన భవనం ఎదుట ఏబీవీపీ రాష్ర్ట మహాసభల పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ ఈ మహాసభలలో విద్యారంగస్థితి, రాష్ర్ట స్థితి, యూనివర్సిటీల స్థితి, జాబ్కాలెండర్ అనే అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు.
అనంతరం తీర్మానాలు ఆమోదించి, ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. విద్యార్థి పరిషత్ రాబోయే కార్యక్రమాల రూపకల్పన జరుతుందన్నారు. విద్యావ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వడానికి విద్యార్థులు పాల్గొని ఈ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేయూ అధ్యక్షుడు హరికృష్ణ, సెక్రటరీ జ్ఞానేశ్వర్, అఖిల్, రాజు, సాయి, రజినీకాంత్, శివరాజ్, మాధవ్, వీక్షితా, భరత్, మధు పాల్గొన్నారు.