నర్సింహులపేట, ఫిబ్రవరి 6 : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని బీఆర్ఎస్ మండల నాయకులు బండి రమేశ్, కెవిపిఎస్ జిల్లా
సహాయ కార్యదర్శి మందుల యాకూబ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనేక డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్ రమేశ్ బాబుకు అందించారు.
అనంతం మాట్లాడుతూ మండల కేంద్రంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని అధికారులు స్పందించి ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీపీ పాతూరి మధురెడ్డి, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు సురేశ్, యూత్ బాధ్యులు
కరుణాకర్ రెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు.