హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 23: కాకతీయ విశ్వవిద్యాలయ గోల్డెన్ జూబ్లీ సంవత్సరంలో భాగంగా సోషల్ సైన్సెస్, ఆర్ట్స్విభాగాల ఆధ్వర్యంలో రెండురోజుల జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సోషల్ సైన్సెస్, ఆర్ట్స్ విభాగాల డీన్ ప్రొఫెసర్ బి.సురేష్‌లాల్ తెలిపారు. ఈ జాతీయ సదస్సుకు సంబంధించిన బ్రోచర్‌ను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ రెండు రోజుల జాతీయ సదస్సు ఫిబ్రవరి 26, 27 తేదీల్లో యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ సదస్సులో పాల్గొనదలచిన విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించాలని కోరారు. సదస్సుకు సంబంధించిన మరిన్ని వివరాలు విశ్వవిద్యాలయ వెబ్సైట్ www.kakatiya.ac.in లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.మనోహర్, ఆర్.మల్లికార్జున రెడ్డి, విభాగాధిపతులు ఎం.స్వర్ణలత, బి.రాధికారాణి, ఆర్.మేఘనారావు, ఆకుతోట శ్రీనివాసులు, సంకేనేని వెంకట్, సీహెచ్.రాజ్‌కుమార్, ఎం.లింగయ్య పాల్గొన్నారు.