హనుమకొండ చౌరస్తా, జులై 9: రాష్ట్రంలోని దేవాదాయశాఖలో నిజాయితీగల పేరు గడించిన భద్రాచలం కార్యనిర్వహణాధికారి లాలుకోట రమాదేవిపై జరిగిన దాడిని తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం, తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మహిళా సంఘం పక్షాన ఖండించారు. తన ఉద్యోగ ధర్మంలో భాగంగా భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానం భూముల విషయమై ఏపీలోని అల్లూరి జిల్లాలోని పురుషోత్తమ పట్నంలో పరిశీలనకు వెళ్లిన క్రమంలో భూ ఆక్రమణదారులు ఆమెపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిచారు. బుధవారం హనుమకొండలోని విశ్వబ్రాహ్మణసంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచార్యులు మాట్లాడారు.
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమస్థాయిలో ఈ సమస్యను పరిష్కరించడానికి ముందుకురావాలని దోషులపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడు వీణవంక సదానందం, పెందోట చక్రపాణి, పెందోట సురేష్కుమార్, రాష్ర్ట సంఘం కార్యదర్శులు డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్థన్, సంగోజు మోహన్, మామిండ్లపల్లి సోమేశ్వరాచారి, తంగెళ్ళపెల్లి జయసేన, సిద్దోజు వీరన్న, కట్కొజ్వల సత్యనారాయణ, శ్రీరామోజు నాగసోమేశ్వరాచారి, రాష్ర్ట, జిల్లా సంఘాల నాయకులు గజ్జెల వీరన్న, గజ్జెల చక్రపాణి, బండ్లోజు నర్సింహచారి పాల్గొన్నారు.