హనుమకొండ, ఏప్రిల్ 11 : రైల్వే జోన్ పునర్విభజనలో భాగంగా సౌత్ కోస్టల్ పరిధిలోకి వెళ్తున్న గుణదల (గాలా) క్రూ డిపోను మూసివేసి, వరంగల్‌లో సెంట్రలైజ్డ్ లాబీని ఏర్పాటు చేసేలా చొరవ చూ పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ కోరారు. ఎంజీఎం ఆస్పత్రిలో తొలగించిన 12 మంది ఔట్ సోర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్లకు న్యాయం జరిగేలా కృషి చేయాలని వేడుకున్నారు.
శనివారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను ఎంజీఎం ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి పలు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా గుణదల డిపో కొనసాగింపు వివాదం ముదురుతున్న నేపధ్యంలో దానిని తక్షణమే మూసి వేయాలని, వరంగల్‌లో సెంట్రలైజ్డ్ క్రూ డిపోను ఏ ర్పాటు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని దాస్యం విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన కేటీఆర్ త్వరలోనే రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ని కలిసి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చా రు.
అలాగే 24 ఏళ్లుగా ఎంజీఎంలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ల ను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించారని ఎంజీ ఎం ఉద్యోగ సంఘం బాధ్యుడు సతీశ్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కేవలం నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు రావడంతో సంబంధం లేని జీవోలతో ఔట్ సోర్సింగ్ సిబ్బందికి అన్యాయం చేశారన్నారు. స్పం దిం చిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి విస్మరించిందన్నారు. తొలగించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అండగా ఉంటానని, సమస్య పరిషారమయ్యే వరకు పోరాడుతామని హామీ ఇచ్చారు.