హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సర్వే నం.194/1, 211లోని భూమికి సంబంధించి హకుల వివాదం తేలకుండానే కూల్చివేతలు చేపట్టిన హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్ర హం వ్యక్తం చేసింది. మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉండగానే అధికారులు చర్యలు చేపట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏ ప్రాతిపదికన కూల్చివేతలు చేపట్టారో రికార్డులతో సహా ఈ నెల 11న హాజరై వివరణ ఇవ్వాలం టూ జిల్లా కలెక్టర్‌తోపాటు మల్కాజిగిరి, తిరుమలగిరి తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేసింది.
వాణి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో కొనుగోలు చేసిన ప్లాట్లకు సంబంధించి కాంపౌండ్లను ఎలాంటి నోటీసు ఇవ్వకుం డా జూలై 18న కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ పీ లింగారావు, మరో ఆరుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ వాణి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నుంచి అనుమతించిన లేఔట్ ప్లా ట్లను రిజిస్టర్డ్ సేల్ డీడ్ల ద్వారా కొనుగోలు చేసినట్టు తెలిపారు.
1990లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అనుమతించిందని, అం తేగాకుండా డిఫెన్స్ ఎస్టేట్ అధికారి కూడా ఈ భూమి డిఫెన్స్ శాఖకు చెందినది కాదని, సొసైటీదేనని పేరొన్నారని తెలిపారు. 2022లో హకులకు సంబంధించిన పత్రాలు చూపినప్పటికీ ప్రభుత్వ భూమిగా పేరొంటూ పనులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారని అన్నారు. హకుల వివాదం తేలకుండా చర్యలు తీసుకోరాదంటూ హైకోర్టు మధ్యంత ర ఉత్తర్వులున్నప్పటికీ జూలై 18న ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కాంపౌండ్ వాల్‌ను కూ ల్చివేసి ఫెన్సింగ్ వేశారని, ప్రభుత్వ భూమిగా బోర్డులు ఏర్పాటు చేశారని చెప్పారు.
ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం కింద అదనపు భూమిగా ప్రకటించడంతో ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకున్నదని అన్నారు. ప్రైవేట్ భూమిలో ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేద ని అన్నారు. డిఫెన్స్ ఎస్టేట్ అధికారులు ఇచ్చి న జియో కోఆర్డినేట్ల ఆధారంగా సర్వే నిర్వహించి చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి 2006-07 వరకు రికార్డుల్లో పట్టా భూమిగా ఉన్నదని అన్నారు. తర్వాత రికార్డుల్లో జరిగిన మార్పులపై వివరణ లేదని పేరొన్నారు. గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులున్నప్పటికీ అధికారులు ఫెన్సింగ్ వే య డం కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనేనని వ్యాఖ్యానించారు.