హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)కు సంబంధించిన కీలక ప్రక్రియ తుదిదశకు చేరుకున్నది. ఓటర్లు నిం పిన ఎన్యుమరేషన్ ఫామ్లు బూత్ లెవల్ అ ధికారులకు (బీఎల్వో) అందించే గడువు సో మవారంతో ముగియనున్నది. ఎన్యుమరేషన్ ఫామ్(ఈఎఫ్)ల సమర్పణ గడువును ఇకపై పొడిగించే ఆలోచన లేదని అధికార వర్గాలు తేల్చిచెప్పాయి. సీఈవో కార్యాలయం శనివా రం సాయంత్రం 6 గంటలకు అందించిన నివేదిక ప్రకారం.. హైదరాబాద్ జిల్లాలో డిజిటైజేషన్ కనిష్ఠంగా 58.41శాతమే పూర్తయిం ది.
రాష్ట్రవ్యాప్తంగా 3,38,26, 448 మంది ఓటర్లకుగాను వందశాతం ఈఎఫ్లు పంపిణీ చేయగా, ఇప్పటివరకు 2,64,11,118 ఫా మ్ల (78.08శాతం) డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తయింది. యాదాద్రి భువనగిరి జిల్లా 94.30 శాతం డిజిటైజేషన్తో రాష్ట్రంలోనే అ గ్రస్థానంలో నిలిచింది. జనగామ (91.69%), సూర్యాపేట (90.43%), మెద క్ (90.55%), మహబూబాబాద్ (90.06%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.