కురవి, సెప్టెంబర్ 07: మహబూబాబాద్ కురవి మండల కేంద్రంలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయం ఆదివారం రాత్రి చంద్రగ్రహణం సందర్భంగా ఆలయ గర్భగుడి ద్వారాలను మూసివేశారు. స్వామివారికి త్రికాల పూజలు నిర్వహించి మహా నైవేద్యం సమర్పించారు.
ముందుగా ఆలయంలోని భక్తులను బయటకు పంపి ఆలయాన్ని పూర్తిగా మూసివేయడం జరిగింది. గ్రహణం ముగిసిన అనంతరం ఆలయ సంప్రోక్షణ కార్యక్రమం జరగనుంది. సోమవారం ఉదయం సుమారు 4.30 గంటలకు సంప్రోక్షణ అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు ఆలయ అధికారులు, పూజారులు తెలిపారు.