కాజీపేట, సెప్టెంబర్ 14 : నాగపూర్- సికింద్రాబాద్- నాగపూర్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కాజీపేట మీదుగా సోమవారం నుంచి నడిపిస్తున్నట్లు స్థానిక రైల్వే ఇన్చార్జి సీసీఐ సజ్జన్‌లాల్ తెలిపారు. నాగపూర్ రైల్వేస్టేషన్లో మొదటిరోజు సోమవారం సాయంత్రం 4.15 గంటలకు ప్రధాని నరేంద్ర మో దీ అహ్మదాబాద్ నుంచి వర్చువల్‌గా ప్రారంభిస్తారన్నారు. అధునాతన సౌకర్యాలు ఉన్న 20 బోగీలతో 1,440 మంది ప్రయాణికులతో నడుస్తుంది.
నాగపూర్ నుంచి సికింద్రాబాద్‌కు కేవలం 7.15 గంట ల్లో చేరుకుంటుందన్నారు. నాగపూర్‌లో సాయంత్రం 4.15 గంటలకు బయ లు దేరి, రాత్రి 9. 25 గంటలకు కాజీపేటకు, సికింద్రాబాద్‌కు 11.25 గంటలకు చేరుకుంటుందని చెప్పారు. రైలు రాకపోకల్లో సేవాగ్రామ్, చంద్రపూర్, బల్లార్షా, రామగుండం, కాజీపేట స్టేషన్లలో ఆగనున్నది. కాగా, కాజీపేట జంక్షన్లో భారీగా స్వాగత ఏర్పాట్లు చేయనున్నట్లు సజ్జన్‌లాల్ తెలిపారు. ఎం పీ, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైల్వే ఏడీఆర్ ఎం, సీనియర్ డీఎం ఈ, సీనియర్ డీఈఈ, ప్రజ లూ తరలివచ్చి వందే రైలుకు స్వాగతం పలికాలని కోరారు.
18 వ తేదీ నుంచి నాగపూర్(20101)లో వందే భార త్ రైలు ఉదయం 5 గంటలకు బయలుదేరి 10.04 గంటలకు కాజీపేటకు, సికింద్రాబాద్‌కు మధ్యాహ్నం 12.15 గంటలకు చేరుకుంటుందని తెలిపారు. తిరిగి అదే రైలు (20102) నంబర్‌తో సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం ఒం టి గంటకు బయలుదేరి కాజీపేటకు 2.20 గంటలకు, నాగపూర్‌కు రాత్రి 8.20 గంటలకు చేరుకుంటుందన్నారు. ఈ రైలు వారానికి ఆరు రోజులు మాత్రమే నడుస్తుందన్నారు.