నగరం విస్తరిస్తున్న కొద్దీ దహన సంస్కారాలు చేసేందుకు స్థలం కొరత వేధిస్తున్నది. ఇక ఉపాధి, చదువులు, ఇతర అవసరాల కోసం వచ్చే కుటుంబాల్లోని వ్యక్తులు చనిపోతే అంతిమ సంస్కారాల నిర్వహణకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటన్నింటినీ గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో పలుచోట్ల శ్మశాన వాటికలను నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 57వ డివిజన్లో 2.5 ఎకరాల్లో మోడల్ వైకుంఠధామాన్ని అభివృద్ధి చేసింది. ఇందులో రూ.3 కోట్లతో సకల సౌకర్యాలు కల్పించింది. నాలుగు బర్నింగ్ ప్లాట్‌ఫాంలు, పురుషులు, మహిళలకు వేర్వేరుగా గదులు నిర్మించింది. కర్మకాండలు చేసుకునేందుకు అనువుగా పెద్ద హాలు, రెండు గదులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. అస్థికలు భద్రపర్చుకునేందుకు లాకర్ల సదుపాయం కల్పించింది. పెద్ద ఎత్తున మొక్కలు పెంచుతుండడంతో పచ్చని పరిసరాలతో వైకుంఠధామం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది.
– వరంగల్, మే 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్, మే 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి): గతంలో ఊరి చివరన, కిలోమీటర్ల దూరం వెళ్లి కులా లు, సంఘాలు, ప్రాంతాల వారీగా ఎవరికి వారు వేర్వేరు ప్రదేశాల్లో అంతిమ సంస్కారాలు నిర్వహించేవారు. కనీస సౌకర్యాలు లేక ఎన్నో అవస్థలు పడే వారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆఖరి మజిలీ సాఫీగా సాగేందుకు అత్యాధునిక సౌకర్యాలతో వైకుంఠధామాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 57వ డివిజన్లో రాష్ట్ర ప్రభుత్వం మోడల్ వైకుంఠధామాన్ని అభివృద్ధి చేసింది. ఉపాధి, చదువులు, ఇతర అవసరాల కోసం వచ్చే కుటంబాల్లోని వ్యక్తులు చనిపోతే దహన సంస్కారాల నిర్వహణకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితులను తొలగించేం దుకు సర్కారు ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రామాలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రత్యే కంగా ప్రణాళికలు రూపొందించి వైకుంఠధామాలను నిర్మిస్తున్నది. గ్రేటర్ వరంగల్‌లోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రెండున్నర ఎకరాల్లో ఈ మోడల్ వైకుంఠధామం నిర్మించారు. రూ.3 కోట్లతో ఇందులో సకల వసతులు కల్పించారు. మృతదేహాల దహనం కోసం నాలుగు బర్నింగ్ ప్లాట్‌ఫాంలను నిర్మించారు. దహన సంస్కారాల కోసం వచ్చే వారు అక్కడ నిల్చునేందుకు వీలుగా పచ్చికను ఏర్పాటు చేశారు. మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా గదులు ఉన్నాయి. కర్మకాండలు చేసుకునే విధంగా పెద్ద హాలు, రెండు గదులతో భవనాన్ని నిర్మించారు.
అస్థికలు భద్రపరుకునేందుకు లాకర్లు, నిర్వహణ కోసం ఆఫీసు కేటాయించారు. వైకుంఠధామం పరిసరాల్లో మొక్కలు పెంచుతుండగా, గార్డెనింగ్‌తో ఆరడుగుల ఎత్తయిన శివుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. నగరం నడిబొడ్డున ఇంత విస్తీర్ణంలో ప్రశాంతంగా, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా వైకుంఠధామం అంతటా పచ్చదనంతో నిండి ఉన్నది. పూలు, ఎక్కువగా ఆక్సిజన్ ఉత్పత్తి చేసే మొక్కలను పెంచుతున్నారు. మనిషి జీవనసారాన్ని తెలియజెప్పేలా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బర్నింగ్ ప్లాట్ ఫాం వద్దకు వెళ్లే దారిలోని గోడలపై వేసిన పెయింటింగ్ పుట్టుక, చావు, జీవిత పరమార్థాన్ని తెలిపేలా ఉన్నాయి. ఈ మోడల్ వైకుంఠధామాన్ని ఈ నెల 5న రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు ప్రారంభించనున్నారు.
ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత సహజమైనది మరణం. జీవితాంతం మనతో కలిసి ఉన్న వారికి అన్ని విధాలుగా వీడ్కోలు పలకడం మన బాధ్యత. దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆఖరి మజిలీ సాఫీగా సాగేలా పల్లెలు, పట్టణాల్లో అత్యాధునిక సౌకర్యాలతో వైకుంఠధామాలను అభివృద్ధి చేస్తున్నది. ఇందులో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 57వ డివిజన్లో రెండున్నర ఎకరాల్లో రూ.3 కోట్లతో మోడల్ శ్మశానవాటికను ఆధునిక హంగులతో తీర్చిదిద్దింది. నాలుగు బర్నింగ్ ప్లాట్‌ఫాంలు, మహిళలు, పురుషులకు ప్రత్యేకంగా వేర్వేరు గదులు నిర్మించింది. అస్థికలు భద్రపరుచుకునేందుకు లాకర్లు అందుబాటులో ఉంచింది. వైకుంఠధామం పరిసరాల్లో మొక్కలు నాటి మధ్యలో ఆరడుగుల శివుడి విగ్రహం ఏర్పాటుచేసింది. మనిషి చావు పుట్టుకల పరమార్థం తెలిసేలా గోడలపై పెయింటింగ్ వేయించింది. ఈ నెల 5న మంత్రి కేటీఆర్‌తో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది.
– వరంగల్, మే 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)