నెక్కొండ, జూన్ 6 : గ్రామంలో భక్తి భావంతో పాటు అభివృద్ధి కొనసాగితే సమగ్రంగా గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. మండలంలోని సూరిపల్లిలో పెద్దమ్మ తల్లి పెద్దిరాజు స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి వారు హాజరై మాట్లాడారు. ఒక గ్రామం సాంస్కృతికంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందితే సమాజంలో నైతిక శక్తి పెరుగుతుందన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల ఐకమత్యాన్ని పెంచుతాయన్నారు. సూరిపల్లి గ్రామం ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అర్చకులు స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి విశేషంగా పూజలు చేశారు.
కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ మారం రాము, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంఘని సూరయ్య, న్యాయవాది కొమ్ము రమేష్ యాదవ్, మండల నాయకులు గుంటకల్ సోమయ్య, కుమార్ రెడ్డి, రవీందర్ రెడ్డి, బండ సత్యనారాయణ రెడ్డి, తోట సాంబయ్య, దొమ్మటి పురుషోత్తం, కార్యాల సురేష్, మాతంగి రాజు, ఆలయ చైర్మన్ దుంది శ్రీను, సహకార సంఘాల అధ్యక్షుడు రాజేష్, మంగళపల్లి వెంకట్, కట్కూరి ఉమేష్ సింగర్ రాజు, సింగారపు రంజిత్, పిట్టల వెంకన్న,మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ స్వప్న పాల్గొన్నారు.