రాయపర్తి/నెక్కొండ, సెప్టెంబర్ 21: ఎంగిలి పూల బతుకమ్మ పండుగ రోజు కూడా రైతులకు యూరియా కష్టాలు తప్పలేదు. ఆదివారం రాయపర్తిలోని రెండు ప్రైవేట్ దుకాణాలకు యూరియా బస్తాలు వచ్చాయనే సమాచారంతో రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి బారులు తీరారు. బతుకమ్మ పేర్చుకుంటూ ఇంటిపట్టున ఉండాల్సిన మహిళలు యూరియా కోసం క్యూలో నిలబడాల్సి వచ్చిందని వాపోయారు.
నెక్కొండ మండలంలోని చిన్నకోర్పోలు గ్రామం, చెరువుముందరితండాకు సంబంధించి 300 యూరియా బస్తాలకు టోకెన్లు పంపిణీ చేసేందుకు వ్యవసాయాధికారులు సిద్ధమవ్వగా, 600 మంది రైతులు క్యూ కట్టారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మహిళలు, రైతులు క్యూలో నిలబడి టోకెన్లు పొందారు.