కాజీపేట, మే 2: ఉప్పల్ రైల్వే స్టేషన్లో గుర్తుతెలియని వ్యక్తి తెల్లవారుజామున రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. జీఆర్పీ సీఐ రామ్మూర్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పల్ రైల్వే స్టేషన్ యార్డులో గుర్తుతెలియని వ్యక్తి ఫోర్త్ అప్ మెయిన్ లైన్లో విశాఖపట్నం నుంచి గాంధీ ధామం రైల్వే స్టేషన్కు వెళ్తున్న రైలు నెంబర్ 2 0 8 0 3 ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతుడు (45) సంవత్సరాలు, ఎడమచేతిపై లాలా అనే పచ్చబొట్టు ఉందని, ఒంటిపై నలుపు ఆకుపచ్చ చిన్న గడల షర్టు, నలుపు ప్యాంటు ధరించి ఉన్నాడని తెలిపారు. మృతుని జేబులో ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్పారు. కేసు నమోదు చేసి శవాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీ లో భద్రపరచామన్నారు. మృతునికి ఎవరైనా సంబంధీకులు ఉంటే కాజీపేట జీఆర్పీ స్టేషన్, లేదా, సెల్ నెంబర్ 9247800433 లో సంప్రదించారని కోరారు.