తాడ్వాయి, ఫిబ్రవరి11: అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకార్యర్థం జాతర పరిసరాల్లో మరుగుదొడ్లు కానరావడం లేదు. దీంతో మేడారం వచ్చే భక్తులు కాలకృత్యాలు ఎలా తీర్చుకోవాలనేది ప్రశ్నార్థకంగా మారింది. జాతరకు రూ. కోట్లు వెచ్చించి సౌకర్యాలు కల్పించామని చెబుతున్న ప్రభుత్వం, అధికారులు ఒక్క మరుగుదొడ్డిని కూడా ఏర్పాటు చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది.
ప్రస్తుతం ఆర్టీసీ బస్టాండ్, గద్దె ల వెనకభాగం, సారలమ్మ ఓట్గేట్ సమీపంలో, జంపన్నవాగు వద్ద సులభ్ కాంప్లెక్స్‌లు ఉండగా, ఐటీడీఏ క్యాంపు కార్యాలయం సమీపంలో మరో మినీ సులభ్ కాంప్లెక్స్ ఉంది. వీటిలో సుమారు 40 దాకా మరుగుదొడ్లు ఉన్నాయి. మినీ జాతరకు సుమారు 40 లక్షల మంది భక్తులకు ఈ టాయిలెట్లు సరిపోతాయా అనేది అధికారులకే తెలియాలి.
అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు ఎక్కువగా చిలకలగుట్ట, శివరాంసాగర్ చెరువు, కొంగళమడుగు, కొత్తూరు. రెడ్డిగూడెం, కాల్వపల్లి చెక్‌పోస్టుల వద్ద విడిది చే స్తారు. ప్రస్తుతం అధి కారులు ఈ ప్రాంతాల్లో మ రుగుదొడ్లు ఏర్పాటు చేయకపోవడంతో వారంతా బహిరంగంగానే మల మూత్రవిసర్జన చేసే అవకాశం ఉంది. మామూలుగానే జాతరలో కోళ్లు, మేకల వ్యర్థాలతో దుర్వాసన కొడుతుంది. ఇప్పు డు మలమూత్ర విసర్జనలతో మేడారంతో పాటు గ్రామాలు కాలుష్యమయం కానున్నాయి.