శీబుగ్గ, జూన్19: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం పసుపు రైతులు ఆందోళన చేపట్టా రు. ఈ-నామ్ ద్వారా పసుపు తక్కువ ధరకే కోనుగోలు చే స్తున్నారని, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో రెండు గంటలపాటు క్రయవిక్రయాలు నిలిచిపోయా యి. విషయం తెలుసుకున్న మార్కెట్ కమిటీ అధికారులతోపాటు అడ్తి సెక్షన్ అధ్యక్షుడు ఎన్రెడ్డి లింగారెడ్డి, ఎనుమాముల ఎస్సై మిరిపెల్లి రాజు పసుపు యార్డుకు చేరుకొని రైతులతో మాట్లాడారు. వ్యాపారులు సిండికేట్గా మారి కావాలనే తక్కువ ధరతో క్రయవిక్రయాలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు.
అత్యధికంగా పసుపు క్వింటాకు రూ.12,550 పలికితే, మిగతా సరుకును క్వింటాకు రూ.6వేల నుంచి రూ.3,500 కే కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. దీంతో మార్కెట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, ఈ-నామ్ ద్వారా కొన్ని లాట్లకు సింగిల్ టెండర్ వేయగా, వాటికి డమ్మిగా అధికారులు ధరలు వేసి టెండర్ ఓపెన్ చేసినట్లు తెలిపారు. దీంతో అతి తక్కువగా ధరలు కోడ్ కావడంతో రైతులు ఆందోళన చేపట్టారు. తాము ఆరుగాలం కష్టపడి పంట పండించి మార్కెట్కు తెస్తే వ్యాపారులు తక్కు వ ధరకే కొనుగోలు చేసి నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అత్యధికంగా పలికిన ధరకు కనిష్ఠంగా పలికిన ధరకు మధ్య వ్యత్యాసం చాలా ఉందన్నారు.
ధరలు నచ్చితేనే విక్రయించుకోవాలని, నచ్చని రైతులు మరుసటి రోజు అమ్ముకోవాలని అధికారులు సూచించడంతో, ధర నచ్చని వారు మరుసటి రోజు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆందోళన సద్దుమణగడంతో ఆలస్యంగా కాంటాలు నిర్వహించారు. కాగా, గురువారం 174లాట్ల పసుపు రాగా, అత్యధికంగా రూ.12,550, మధ్య రకానికి రూ.10వేలు, కనిష్ఠంగా రూ.3,500 ధరలు పలికాయి. కొన్ని లాట్స్కు సింగిల్ టెండర్లు పడగా, వాటికి మరుసటి రోజు టెండర్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామానికి చెందిన రైతు కొడారి రాజయ్యయాదవ్ తీసుకొచ్చిన పసుపు గోల రకం క్వింటాలుకు రూ.3,500 ధర పలుకకగా, తాను పెట్టిన పెట్టుబడి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.