మంగపేట : ములుగు జిల్లా మంగపేట మండలం చెరుపల్లి (కొత్తపేట) లోని నాయకపోడు వాడకు చెందిన పలువురు నిరుపేదలకు వచ్చిన ఇండ్లను రద్దుచేసి భూములు ఆస్తులు ఉన్నవారికి ఎందుకు కేటాయి స్తున్నారని స్థానిక కాంగ్రెస్ నాయకులను తీరుపై పలువురు గిరిజన లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తమ పేర్లు వచ్చాయని కొందరు లంచాలు తీసుకొని తమకు వచ్చిన ఇండ్లను తమకు అనుకూలమైన వారికి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో తమను మోసం చేశారని వాపోయారు. రోజు కూలి పనులు చేసుకుంటే గానీ పూట గడవని స్థితిలో ఉన్న తమ ఇండ్లను రద్దు చేయడంపై మంత్రి సీతక్క తో పాటు కాంగ్రెస్ నాయకుల వైఖరి పై పలువురు లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.