మహబూబాబాద్ రూరల్ : స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్‌కు చేదు అనుభవం ఎదురైంది. పట్టణ శివారులోని శనిగపురం రోడ్డులో డాక్టర్ ప్రమోద్ రెడ్డి నూతనంగా నిర్మించిన పాఠశాల ప్రారంభోత్సవానికి వెళుతున్న క్రమంలో గిరిజన రైతులు ఎమ్మెల్యే మురళీ నాయక్ వాహనాన్ని అడ్డుకున్నారు. గిరిజన భూములను ఆక్రమించి అనేక నిర్మాణాలు చేసి పాఠశాల నిర్మించి అదే పాఠశాలను ప్రారంభించడానికి వెళ్తున్నావా? అని ఎమ్మెల్యేను గిరిజన రైతులు నిలదీశారు. గిరిజన రైతులకు అండగా నిలవాల్సిన ఎమ్మెల్యే నే అగ్రవర్ణానికి చెందిన వారికి సపోర్టుగా నిలవటం ఏమిటి అని ప్రశ్నించారు.
సమాచారం అందుకున్న టౌన్ పోలీసులు రైతులకు సర్ది చెప్పినా తమ నిరసనను విరమించలేదు. దీంతో ఎమ్మెల్యే చేసేదేమి లేక ప్రైవేటు పాఠశాలను ప్రారంభించకుండానే వెనుదిరిగారు. ఈ ఘటన పట్టణంలో చర్చ నియాంశంగా మారింది. నిరసన కార్యక్రమంలో గిరిజన రైతులు బోడ రమేష్, భూక్య శ్రీను, బాలాజీ, హరి, శాంతి, తార, తదితరులు పాల్గొన్నారు.