వాజేడు ,జూన్ 14 : ములుగు జిల్లా వాజేడు మండలంలో మొరుమురుకాలనీ పాఠశాలలో టైల్స్ పనులు పూర్తయి తరగతి గదులు అందంగా ముస్తాబయ్యాయి. ‘సమస్యలు ఇలా.. చదువులు సాగేదెలా’ శీర్షికన ఈ నెల 13న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అసంపూర్తిగా ఉన్న టైల్స్ పనులను పూర్తిచేయించారు. దీంతో ఈ గదుల్లోనే ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు. కాగా, హ్యాండ్ వాష్, తాగునీటికి సంబంధించిన సనులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. వీటిని కూడా త్వరగా పూర్తి చేసేలా అధికారులు చొరవ చూపాలని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు.