నర్సంపేట రూరల్, అక్టోబర్ 10: తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్‌మోడల్‌గా మారిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నర్సంపేట మండలం రాములునాయక్‌తండా నుంచి కాంగ్రెస్, బీజేపీకి చెందిన 110 కుటుంబాలు ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. గ్రామానికి చెందిన బానోత్ రవి, చిన్న రవి, అజ్మీరా మోహన్, పాల్తియ గోపి, బానోత్ లింగన్న, అజ్మీరా నర్సింహ, పాల్తియ శ్రీను, అజ్మీరా రాజు, రాణి, రాంధన్, కిట్టు, కుమార్, భూక్య యాకూబ్, శ్రీను, భాస్కర్, రజిత, లక్ష్మీ, వీరమ్మ, భద్రమ్మ, విజయ, సమ్మక్క, లలిత, సరోజ, లక్ష్మీ, మంగమ్మ, కౌసల్య, సుజాత, మల్లమ్మ, రజిత, జ్యోతి, మంజుల, సోన, మమత, శారద, వనజ, వినోద, పద్మ, లలిత, నీలమ్మ, ఈర్య, గోవింద్, ప్రమీళ, కైక, ప్రేమ్‌సింగ్, భధ్రు, రాజేందర్, నర్సయ్య, బాలమ్మ, రాజు, స్వప్న, నర్సమ్మ, పూలమ్మ, రవి, నర్సయ్య, భద్రు, రాజేశ్వరి, రవి, లలిత, రవి, దేవి, ఈశ్వరమ్మ, జ్యోతి, వెంకన్న, స్వామి, తీరమ్మ, సుభద్ర, సూరమ్మ, మల్లికాంబ, శాంతమ్మ, ఎల్లమ్మ, సాల్కి, భూక్య స్వాతి, భద్రు, రాజు, తావుర్య, చిరంజీవి, జగన్, భాస్కర్, వీరాసింగ్, సుదర్శన్, రమేశ్, వెంకటేశ్, వీరు, రోజన, సంధ్య, మంగమ్మ, జశ్విర్, భూక్య సంపత్, రాజ్‌కుమార్, శాంతమ్మ, స్వప్న, బాలమ్మ, గోవింద్, ప్రతాప్, లాల్‌సింగ్, కుమార్, గడ్డి మల్లమ్మతోపాటు మరికొందరు బీఆర్ఎస్లో చేరారు.
వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై వివిధ పార్టీలకు చెందిన చాలామంది కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. పార్టీలో చేరిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, క్లస్టర్ ఇన్చార్జిలు కోమాండ్ల గోపాల్‌రెడ్డి, మోతె పద్మనాభరెడ్డి, ఆర్ఎస్ఎస్ కన్వీనర్ మోతె జయపాల్‌రెడ్డి, పిన్నింటి దేవేందర్‌రెడ్డి, ఆంగోత్ సుధాకర్లాల్, మచ్చిక రాజుగౌడ్, బానోత్ భాస్కర్, చీరాల గోవర్ధన్‌రెడ్డి ఉన్నారు.
మండలంలోని గుంటూరుపల్లిలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 20 మంది ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన మ్యాకల పోశాలు, బుర్రి సారంగం, సౌరపు నర్సయ్య, అకినపెల్లి ఎల్ల స్వామి, సంతోష్, బుర్రి రాధ, బుర్రి పద్మ, మేకల సూరమ్మ, చిన్నపెల్లి కనకమ్మ, చిన్నపెల్లి మల్లయ్య, చంద్రకళ, నామిండ్ల కర్ణాకర్తోపాటు మరికొందరు బీఆర్ఎస్ పార్టీలో చేరగా ఎమ్మెల్యే పెద్ది వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. మండల నాయకులు బండారి రమేశ్, పార్టీ గ్రామ అధ్యక్షుడు గుగులోత్ శ్రీను, చుండు ప్రశాంత్, చుండు లక్ష్మయ్య, కొంగర సుబ్బారావు, రాంపాక నగేశ్, బానోత్ జీవన్, పార్టీ గురిజాల గ్రామ అధ్యక్షుడు చిన్నపెల్లి నర్సింగం, పత్రి కుమారస్వామి ఉన్నారు.
నల్లబెల్లి: టీడీపీకి చెందిన గుండ్లపహడ్ మాజీ ఎంపీటీసీ జాటోత్ సంతోష్‌నాయక్, సుజాత దంపతులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలుపొంది అభివృద్ధి చేశానని, మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని పెద్ది చెప్పారు. ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్, చిన్నా, తిరుపతినాయక్, జీవ్లానాయక్ పాల్గొన్నారు.