మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో కొన్నేళ్లుగా జీవనదిలా ఉన్న పాకాల వాగు ప్రస్తుతం వట్టిపోయింది. దీనిపై ఆరు చెక్‌డ్యాంలు కట్టగా, అవన్నీ చుక్క నీరు లేక వెక్కిరిస్తున్నాయి. ఈ చెక్డ్యాముల్లో గతంలో ఎండాకాలంలో పాకాల చెరువు నీరు వదలడంతో రైతులు రెండు పంటలు పండించేవారు. ఈ ఏడాది కూడా అదే ఆలోచనతో వరి, మక్కజొన్న, మిర్చి పంటలు వేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు వాగులో నీటిని వదలక పంటలు ఎండిపోతున్నా యని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకాల చెరువు నీటిని వదిలి చేతికొస్తున్న పంటలను కాపాడాలని వేడుకుంటున్నారు. – గూడూరు, మార్చి 30
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని సగం గ్రామాల రైతులు పాకాలవాగు నీటిపై ఆధారప డి వ్యవసా యం చేస్తుంటారు. ఈ వాగు పరీవాహకంలో పొనుగోడు, అయోధ్యపురం, గూ డూరు, బొల్లేపల్లి, నాయకపల్లి, తీగలవే ణి, గోవిందాపురం, అప్పరాజుపల్లి వం టి గ్రామాలున్నాయి. వాగులో నీరుంటే భూ గర్భ జలాలు పుష్కలంగా ఉండి వ్య వసాయం, బోరు బావుల్లో నీరుండేది. ఈ అవసరాలను గుర్తించి గత ప్రభు త్వం పాకాల వాగుపై ఆరు చెక్‌డ్యాంలు నిర్మించింది. వీటిలో వర్షపునీటితో పాటు ఎండాకాలంలో పాకా ల చెరువు నీరు వదలడంతో రైతులు పంటలను పండించేవారు. ఈ సారి చెక్‌డ్యాంల కింది భాగంలో నీరులేక చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయి. తీగలవేణి, పాటి మీదితండా, నాయకపల్లి గ్రామాలకు పాకాల చెరువు నీటిని అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
చుక్కనీరు లేని ముష్టికుంట
డోర్నకల్, మార్చి 30 : డోర్నకల్ మండలం వెన్నారం గ్రామ సమీపంలోని ముష్టికుంటలో ప్రస్తుతం చుక్క నీరు లేదు. గతంలో వేసవిలో ఎస్సారెస్పీ జలాలతో నింపేవారు. ఈ ఏడాది విడుదల చేకపోవడంతో మార్చిలోనే ఎండిపోయింది. కుంటలో నీరు లేకపోవడంతో భూగర్భ జలాలు తగ్గి బావుల్లో నీరు ఇంకిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాకాల నీటిని వదిలి ఆదుకోవాలి
నేను ఆరెకరాలు వరి వేశాను. గతంలో మాదిరిగా పాకాల వాగులో నీటిని వదులుతారని ఆశపడ్డాను. పంటచేతికి వచ్చే దశలో నీరులేక భూమి నెర్రెలు బారుతున్నది. గతంలో పాకాల వాగు ఎండాకాలంలో కూడా నిండుగా పారేది. పైనుంచి నీటిని వదలలేదు. మిర్చి పంట కూడా వేశాను. పెట్టుబడి కూడా రాలేదు. గతంలో నీరు, కరెంట్ 24గంటలు ఉండే, రైతుబంధు రాలేదు. పంట ఎండిపోవడంతో మళ్లీ వలస పోవాల్సి వస్తుందేమోనని ఆందోళనగా ఉంది. ఇప్పటికైనా పాకాల చెరువు నీటిని వదిలి పంటను కాపాడాలి.
– బానోత్ నర్సింహానాయక్, రైతు
12 ఎకరాల పంట ఎండింది
మహబూబాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ), తొర్రూరు : వరి సాగు చేద్దామని 12 ఎకరాలు కౌలుకు తీసుకున్న. రూ. రెండు లక్షల 20 వేలు అప్పు తెచ్చి వరి పంట వేసిన. మొదట్లో మంచిగనే ఉన్నది. ఇప్పుడు పంట పూర్తిగా ఎండిపోయింది. ఏం చేయాలో తెలియడం లేదు. ఎవర్ని అడగాలో కూడా తోచడం లేదు. పకనే సబ్ కెనాల్ ఉంది. కానీ అందులో నీరు రా వడం లేదు. కళ్ల ముందు నీటి వంతెనలా కనిపించినా మా పొలాలకు మాత్రం చుక నీరు రాలేదు. బోరు, బావి ఉన్నా వాటిలో నీరు లేదు. బావిలో వారానికి ఒకసారి కొద్దిగా నీరు ఊరుతు న్నా 12 ఎకరాల పొలానికి అది ఏం సరిపోతుంది. మేం పంటకు పెట్టిన అప్పులు ఎప్పుడు తీర్చగలం. మా కుటుంబం ఇప్పుడు ఎలా బతకాలో అర్థం కావడం లేదు. ఈ పరిస్థితికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. పకనే కాల్వ ఉన్నా నీరివ్వకపోతే రైతులు ఎలా బతకగలరు.
– అకల శంకర్, రైతు, మాటేడు, తొర్రూరు