చేపల కోసం చెరువు ఖాళీ
చేపలు పట్టేందుకు చెరువులోని నీటిని ఖాళీ చేస్తున్నారు. వేలాది క్యూసెక్కుల నీటిని వృథాగా వదిలేస్తున్నారు. ములుగు జిల్లా అతిపెద్ద జలాశయమైన లోకంచెరువు నుంచి కొన్ని రోజులుగా నీటిని విడుదల చేస్తున్నారు.
- తూములు ఎత్తి నీరు వదిలిన వైనం
- లోకంచెరువు నుంచి వృథాగా పోతున్న వేలాది క్యూసెక్కుల నీరు
- అధికారుల పర్యవేక్షణ లోపంతో మత్స్యకారుల ఇష్టారాజ్యం
ములుగు, మే 26 (నమస్తే తెలంగాణ): చేపలు పట్టేందుకు చెరువులోని నీటిని ఖాళీ చేస్తున్నారు. వేలాది క్యూసెక్కుల నీటిని వృథాగా వదిలేస్తున్నారు. ములుగు జిల్లా అతిపెద్ద జలాశయమైన లోకంచెరువు నుంచి కొన్ని రోజులుగా నీటిని విడుదల చేస్తున్నారు. చెరువులో నీటిమట్టం ఎక్కువగా ఉన్నందున చేపలు పట్టేందుకు వీలు కాకపోవడంతో అధికారులు మత్స్యకారులకు వంతపాడి నీరంతా తూము గేట్లు ఎత్తి కాల్వ ద్వారా బయటకు పంపుతున్నారు. ఆయకట్టు పంటలకు అవసరమైనప్పుడు మాత్రమే నీటిని విడుదల చేయాలనే నిబంధనలు ఉండగా అధికారులు అదేమీ పట్టించుకోకుండా, మత్స్యకారుల కాసులకు కక్కుర్తి పడి నీటిని వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. నీరు వృథాగా పోతుండగా ఆయకట్టు రైతులు ఆందోళన ఎలుకల బాధకు ఇల్లు తగులబెట్టుకున్న చందంగా చేపలు పట్టేందుకు పంటలకు అవసరమైన నీటిని వృథాగా బయటకు వదలడం ఏమిటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయా అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. చెరువులో నుంచి నీరు బయట పోతుండగా సంఖ్యలో చేపలు సైతం చనిపోయి కనిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే చెరువు నీరంతా వృథాగా పోతోందని పలువురు రైతులు
వృథాగా పోతున్న నీరు
కాకతీయుల కాలం నాటి లోకంచెరువు కింద 3వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువులోని నీరు రెండు పంటలకు సరిపోతాయి. ఐదేళ్లుగా ఎండా కాలంలో సగం కంటే ఎక్కువ నీరు నిల్వ ఉంటోంది. మూడేళ్లుగా వర్షాకాలం ప్రారంభంలోనే మత్తడి పోస్తూ ఉంటుంది. ఐదేళ్ల కింద చేప పిల్లలు పోసిన కాంట్రాక్టర్ రెండేళ్లు చెరువులో నీటిమట్టం ఎక్కువగా ఉండటంతో చేపలు పట్టలేదు. దీంతో వానాకాలం ప్రారంభంలో చెరువు మత్తడి పడినప్పుడు చేపలు దిగువకు వెళ్లిపోయాయి. చేపలు పోసిన కాంట్రాక్టర్ ప్రస్తుతం చేపలు పట్టుకునేందుకు నీటిని తూముల ద్వారా కాల్వల్లోకి వదులుతుండడంతో దిగువనున్న తోపుకుంట పూర్తిగా నిండింది. మిగిలిన నీళ్లు వెళ్తోంది. ఈ క్రమంలో నీరంతా వృథాగా పోతోంది.
షెట్టర్ల లీకేజీలతోనే..
చెరువు తూముల వద్ద షెట్టర్ల లీకేజీ కారణంగా నీళ్లన్నీ కాల్వలోకి వెళ్తున్నాయి. ఎన్నికల విధుల్లో ఉన్నందున లీకేజీ విషయం నా దృష్టికి రాలేదు. ఎన్నిక తర్వాత షెటర్లకు మరమ్మతులు చేయించి లీకేజీలను అరికడుతాం.
– రవీందర్‌రెడ్డి, ఇరిగేషన్‌శాఖ డీఈ
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

