నమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 2 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం తుది విడత పంచాయతీ ఎన్నికల కు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ములుగు, హనుమకొండ, వరంగల్, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలోని 24 మండలాల పరిధిలోని 564 జీపీలు, 4,896 వార్డులకు ఎన్నికలు జరగనున్నా యి.
ములుగులో కన్నాయిగూడెం, వాజేడు, వెంక టాపురం (నూగూరు), హనుమకొండలో ఆత్మకూ రు, శాయంపేట, నడికూడ, దామెర, వరంగల్ లోని నర్సంపేట, ఖానాపూర్, చెన్నారావుపేట, నెక్కొండ, జనగామలోని దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల, భూపాలపల్లిలోని మల్హర్, మహదేవపూర్, మహాముత్తారం, కాటారం, మహబూబాబాద్‌లోని డోర్నకల్, గంగారం, కొత్తగూడ, కురవి, మరిపెడ, సీరో లు మండలాల్లో ఏర్పాటు చేసిన 175 క్లస్టర్ కేంద్రా ల్లో ఈ నెల 5 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 9న ఉపసంహరణల అనంతరం పోటీ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు.
ముగిసిన రెండో దశ నామినేషన్లు
ఉమ్మడి జిల్లాలో రెండో విడత నామినేషన్ల ప్ర క్రియ ముగిసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 564 సర్పంచ్‌లు, 4928 వార్డుమెంబర్ల స్థానాలకు ఆదివారం నుంచి నామినేషన్లు స్వీకరించగా మంగళవారంతో ముగిసింది. చివరిరోజు నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు పోటెత్తగా రాత్రి వరకు అధికారులు స్వీకరించారు. కాగా, మొదటి విడత ఎన్నికలకు సంబంధించి బుధవారం మ ధ్యాహ్నం వరకు ఉపసంహరణ గడువు ఉండగా, అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటించి గుర్తులను కేటాయించనున్నారు.
