ఇద్దరు బీటెక్ విద్యార్థుల దుర్మరణం
నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు బైక్పై వెళ్తూ డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందిన ఘటన హైదరాబాద్ నగరం పటాన్చెరు సమీపంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
- డివైడర్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి
- హైదరాబాద్ పటాన్చెరు సమీపంలో ఘటన
- జనగామ జిల్లా అలింపూర్, రాఘవపురంలో విషాదం
బచ్చన్నపేట/పాలకుర్తిరూరల్, జనవరి 1 : నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు బైక్పై వెళ్తూ డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందిన ఘటన హైదరాబాద్ నగరం పటాన్చెరు సమీపంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం అలింపూర్ గ్రామానికి చెందిన పాకాల నితిన్ (20), పాలకుర్తి మండలం రాఘవపురం గ్రామానికి చెందిన రాగం భరత్చందర్(19) హైదరాబాద్లోని సుల్తాన్పూర్ జేఎన్టీయూలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. మరో స్నేహితుడు వంశీతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు సోమవారం తెల్లవారుజామున స్కూటీపై వెళ్తూ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టారు. ఈ ఘటనలో నితిన్, భరత్చందర్ అక్కడికక్కడే మృతి చెందారు. వంశీ తీవ్రంగా గాయపడడంతో చికిత్సకోసం దవాఖానకు తరలించారు. నితిన్, భరత్చందర్ మృతితో అలింపూర్, రాఘవపురంలో విషాదం నెలకొంది. నితిన్ తండ్రి పాకాల కిష్టయ్య ఏడాది క్రితం మృతి చెందగా, తల్లి సంతోష కూలి పనులు చేస్తూ చదివిస్తున్నది. రాగం భరత్చందర్కు ఇద్దరు అక్కలు. తల్లిదండ్రులకు ఇతనొక్కడే కొడుకు. భరత్చందర్ మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. ఇదిలా ఉండగా నితిన్ కుటుంబ సభ్యులను సర్పంచ్ నరెడ్ల బాల్రెడ్డి, ఎంపీటీసీ ఎండీ. మసూద్ పరామర్శించి సంతాపం తెలిపారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

