లింగాల గణపురం : జనగామ జిల్లాలో మరో భద్రాద్రిగా పేరుగాంచిన జీడికల్ ఆలయంలోని హుండీని లెక్కించామని ఈవో వంశీ తెలిపారు. ఆలయంలో అక్టోబర్ 14న హుండీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వాటిని నల్లగొండ దేవాలయ శాఖ ఇన్స్పెక్టర్ నిఖిల్ సమక్షంలో గురువారం లెక్కించగా 2 లక్షల 57 వేల 868 ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పూజారులు భార్గవాచార్యులు, మురళీధర్, కృష్ణమాచార్యులు, సిబ్బంది ఉండబోయిన భరత్ కుమార్, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Keerthy Suresh | అసలు సమస్య అదే!.. దీపికా పని గంటల వివాదంపై స్పందించిన కీర్తి సురేష్
Stock Market | లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. జీవితకాల గరిష్టాన్ని తాకిన నిఫ్టీ..!
Team India | సొంతగడ్డపై భారత్‌కు మరో వైట్‌వాష్.. దక్షిణాఫ్రికా చరిత్రాత్మక విజయం