Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. నిఫ్టీ ఆల్టైమ్ జీవితకాల గరిష్టాన్ని తాకింది. గ్లోబల్ మార్కెట్లో సానుకూల పవనాలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, యూఎస్ వడ్డీ రేట్ల కోతలపై పెరుగుతున్న అంచనాల మధ్య మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. గురువారం ఉదయం సెన్సెక్స్ 85,745.05 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఈ క్రమంలో 85,646.22 పాయింట్ల కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్.. గరిష్టంగా 86,026.18 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది.
చివరకు 358.56 పాయింట్ల లాభంతో 85,968.07 వద్ద ముగిసింది. 50-షేర్ల నిఫ్టీ 90.25 పాయింట్లు పెరిగి ఆల్టైమ్ గరిష్ట స్థాయి 26,295.55 వద్ద చేరుకుంది. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, లార్సెన్ అండ్ టూబ్రో, ఏషియన్ పెయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా లాభాల్లో కొనసాగుతుండగా.. ఎటర్నల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి నష్టాల్లో ముగియనున్నాయి. బుధవారం యూఎస్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఫెడ్ రేటు తగ్గింపు, రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం నేపథ్యంలో అంచనాలున్నాయి.