DeepikaPadukone | బాలీవుడ్ అగ్ర నటి దీపికా పదుకొణె రోజుకు కేవలం 8 గంటలు మాత్రమే పని చేస్తానని చేసిన డిమాండ్.. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కొందరు నటులు దీపికా నిర్ణయాన్ని సమర్థిస్తుంటే మరికొందరు సినిమా షూటింగ్‌లకు ఈ డిమాండ్ సాధ్యం కాదంటున్నారు. అయితే తాజాగా ఈ వివాదంపై జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ స్పందించింది. తన తదుపరి చిత్రం ‘రివాల్వర్ రీటా’ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆమె పని గంటల అంశంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
నా వ్యక్తిగత విషయానికి వస్తే నేను అన్ని సమయాల్లో పని చేస్తాను. నేను అవసరమైతే ఉదయం 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 2 గంటల వరకు కూడా పని చేస్తాను. ‘మహానటి’ సినిమా చేసే సమయంలో అదే టైంలో మరో 5 సినిమాలు కూడా చేశాను. అప్పుడు ఒక సినిమా షూటింగ్‌కు ఉదయం, మరొక దానికి రాత్రి సమయం ఇచ్చాను. నేను వర్క్ విషయంలో అంత డెడికేటెడ్‌గా ఉంటాను. అయితే సాధారణంగా సినిమా షూటింగ్లో ఏం జరుగుతుందో అందరికీ తెలియాలి. అందరూ 9 టు 6 అని ఎందుకు అంటారంటే… మేము 9 గంటలకు సెట్లో రెడీగా ఉండాలంటే, ఉదయం 5 గంటలకు లేచి మేకప్, ఇతర పనులన్నీ మొదలుపెట్టాలి. సాయంత్రం 6 గంటలకు షూటింగ్ అయిపోయినా, ఇంటికి వెళ్లి సర్దుకుని పడుకునేసరికి రాత్రి 10 లేదా 11 అవుతుంది. సరైన నిద్ర ఉండదు. 9 టు 9 అంటే చాలా కష్టం. నటీనటులకే కాదు, సాంకేతిక నిపుణులకు కూడా ఇది వర్తిస్తుంది.
తమిళం, తెలుగులో 9 టు 6 (కొన్నిసార్లు 9 టు 9) ఉంది. కానీ మలయాళం, హిందీలో 12 గంటలు పని చేయాల్సి వస్తుంది. మలయాళంలో బ్రేక్స్ కూడా లేకుండా కంటిన్యూగా షెడ్యూల్స్ ఉంటాయి. ఇది చాలా కష్టం. దీని వల్ల కొందరు కేవలం మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే నిద్ర పోతున్నారు. ఆరోగ్యం పరంగా చూసుకుంటే, రోజుకు 8 గంటల పని (9 టు 6) మాత్రమే సరైనది. ఎందుకంటే మనకు ఆహారంతో పాటు నిద్ర కూడా చాలా ముఖ్యమని కీర్తి సురేష్ తెలిపారు. కీర్తి సురేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
All the actresses are supporting #DeepikaPadukone’s statement about the 8-hour work shift#RashmikaMandanna and now #KeerthySuresh have stated that working more than 8 hours not only impacts the health of actors, but also severely affects all the technicians, as they arrive on… pic.twitter.com/YcRYcXq0D2
— Daily Culture (@DailyCultureYT) November 26, 2025