నెల్లికుదురు, జూన్ 3 : గతేడాది సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు తెగిన చెరువు కట్టలకు తొమ్మిది నెలలైనా మరమ్మతులు చేయలేదని.. రైతులు పంటలు ఎలా పండిస్తారని మాజీ ఎం పీ, బీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత ప్రభుత్వాన్ని ప్ర శ్నించారు. నెల్లికుదురు మండలంలోని రాజులకొత్తపల్లి గ్రామంలో తెగిన చెరువు కట్టను మంగళవారం ఆమె పరిశీలించారు. అక్కడి నుంచే కలెక్టర్‌కు ఫోన్ చేసి సమస్యను వివరించారు.
అనంతరం కవిత మాట్లాడుతూ చెరువు కట్టకు మరమ్మతులు చేయకపోవడం వల్ల ఇప్పటికే రైతులు రెండు పంటలు నష్టపోయారని, వానకాలం స మీపిస్తున్నా ప్రభుత్వం రైతుల సమస్యను పట్టించుకోవడం లేదన్నారు. రాజులకొత్తపల్లి చెరువు కింద సుమారు 800 ఎకరాలు, రావిరాల చెరు వు కింద 400 ఎకరాలు సాగవుతాయని వెంట నే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.
ఆ తర్వాత గతంలో కురిసిన వర్షాలకు శ్రీరామగిరి నుంచి రాజులకొత్తపల్లి వెళ్లే పీఎంజీఎస్‌వై రోడ్డు పూర్తిగా దెబ్బతిని వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేయాలన్నారు. ఆమె వెంట బీఆర్ఎస్ నాయకులు నల్లాని నవీన్‌రావు, శ్రీనివాస్, కళాధర్ రాజు, వివేక్, యాకి రెడ్డి, పుల్లారెడ్డి, వినోద్‌రెడ్డి, నరేశ్ పాల్గొన్నారు.