ఎల్కతుర్తి, ఏప్రిల్ 11 : స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్య మంత్రిగా కేసీఆర్ దేశానికే గొప్ప ఆదర్శ పాలన అందించి ప్రజల మన్ననలు పొందారని తొలి ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే తా టికొండ రాజయ్య కొనియాడారు. శుక్రవారం బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డితో కలిసి ఎల్కతుర్తిలో రజతోత్సవ సభా ప్రాంగ ణాన్ని ఆయన పరిశీలించారు. స్థానిక నేతలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజయ్య మాట్లాడుతూ వరంగల్ అం టే పెద్దసభలకు పెట్టింది పేరన్నారు. జిల్లా నాయకులతో 1200 ఎకరాల్లో సభ నిర్వహించడం హరణీయమని, ఇందులో వాహనాల పార్కింగ్ కూడా భారీగా స్థలాలు కేటాయించారని తెలిపారు.
సభకు సుమారు 10 లక్షల జనం వస్తారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలు గకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. కేసీఆర్ ఆలోచన నభూతో నా భవిష్యత్ అని, తెలంగాణలో ఎప్పుడూ ఇలాంటి సభ జరగలేదనే రీతిలో సభ ఉంటుందని తెలిపారు. కేసీఆర్ సంతృప్తికర పాలనను అందించి చెరువుల మరమ్మతు, మిషన్ భగీరథ, రుణమా ఫీ, రైతుబంధు, రైతుబీమా, 24గంటల కరంటు, పార్టీలకతీతంగా కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, అమ్మాయి పుడితే 13వేలు, ఆసరా పింఛన్ల పెంపు ఇలా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు.
కేసీఆర్ ఎలక్షన్ల వరకే రాజకీయాలు చేసేవారని, తర్వాత పార్టీలకతీతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేశారని కొనియాడారు. ప్రజలంతా కేసీఆర్ పాలనను గుర్తుచేసుకుంటున్నారని, ఈ సభ ద్వారా కేసీఆర్ ఏం చెప్తారని ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. ప్రజలు ఈ సభకు స్వచ్ఛందంగా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, వాహనాల కొరత ఉన్నప్పటికీ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి ప్రజలు పాదయాత్ర, ఎడ్లబండ్ల ద్వారా వచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ధర్మసాగర్ మండల ఇన్చార్జి కర్ర సోమిరెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు కొమ్మిడి మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎల్కతుర్తిలో నిర్వహించే భారీ బహిరంగ సభ చరిత్రను తిరగరాసే సభగా నిలిచిపోతుంది. పదేండ్ల కేసీఆర్ పాలన తెలిసిన ప్రజలు ఇప్పుడు 16 నెలల పాలనను చూసి మళ్లీ ఆయనే రావాలని కోరుకుంటున్నారు. కనీవినీ ఎరగని రీతిలో ఈ సభ జరుగుతుంది. సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చినట్లు పండుగలా జనం వస్తారు. సభను ఎవరూ అడ్డుకోలేరు. పార్టీ కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేసి సభను విజయవంతం చేయాలి.