హసన్పర్తి, నవంబర్ 5: బీఆర్ఎస్తోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 55, 56 డివిజన్ల పరిధిలోని గోపాల్పూర్, పూరిగుట్ట, జవహర్కాలనీ, కోమటిపల్లిలో ఎమ్మెల్యే అరూరి ఆదివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పార్టీ శ్రేణు లు, ప్రజలు మంగళహారతులు, కోలాటాలు, బతుకమ్మలతో ఘనస్వాగతం పలికారు. ఇంటింటికీ తిరుగుతూ కారుగుర్తుకు ఓటువేసి తనను అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఇప్పటివరకు రూ.160 కోట్లతో చేసిన అభివృద్ధి వారికి వివరించారు. ఎన్నో ఏడ్లు పరిపాలించిన కాంగ్రెస్ హయాంలో ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పే వారంటీ లేని గ్యారంటీలను ప్రజలు నమ్మొద్దని కోరారు. ఆచరణకు సాధ్యం కానీ హామీలతో కాంగ్రెస్ ఓట్లు దండుకోవాలని చూస్తోందన్నారు. వారికి డిపాజిట్లు రాకుండా ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. తనను మరోసారి ఎమ్మెల్యేగా ఆదరిస్తే ఎప్పుడూ అందుబాటులో ఉండి కేసీఆర్, కేటీఆర్ సహకారంతో వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేకు పార్టీ శ్రేణులు గజమాలతో సత్కరించారు. కార్పొరేటర్లు జక్కుల రజితా వెంకటేశ్వర్లు, సిరంగా సునిల్, డివిజన్ అధ్యక్షుడు అటికం రవీందర్, రుద్రోజు మణీంద్రనాథ్, ఎర్రగట్టు ఆలయ చైర్మన్ చింతల లక్ష్మణ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి నాయకపు శ్రీను, నాయకులు సాంబయ్యనాయక్, ఉపాధ్యక్షుడు సుధాకర్ పాల్గొన్నారు.
నయీంనగర్/కాశీబుగ్గ: గ్రేటర్ 43, 44వ డివిజన్లలోని పెన్షన్పూర్. లక్ష్మిపూర్లో వివిధ పార్టీలకు చెందిన సుమారు 50 మంది మైనారిటీ నాయకులు, కార్యకర్తలు, 14వ డివిజన్ ఎస్ఆర్నగర్కు చెందిన సీపీఐ, కాంగ్రెస్, బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీజేపీ ఓబీసీ అధికార ప్రతినిధి ఆడెపు అనిల్, ఓబీసీ సెల్ అధ్యక్షుడు ఆడెపు అశోక్, సీపీఐ మాజీ వార్డు సభ్యురాలు హైమావతి, సునితతో ఇతరులకు ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అనేక మంది బీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. చేరిన వారికి సముచిత స్థానం కల్పించి, కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. ప్రతి కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాలని, తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్పొరేటర్ చింతల యాదగిరి, మాజీ వార్డు సభ్యులు హుస్సేన్, బీఆర్ఎస్ నాయకులు కేతిరి రాజశేఖర్, ముడుసు నరసింహా, పసులాది మల్లయ్య, కేతిరి సమ్మక్క, పున్నం ప్రభాకర్ పాల్గొన్నారు.