Warangal | దుగ్గొండి, మే 30 : ఇటీవల అనారోగ్యంతో మండలంలోని మధిర మందపల్లి గ్రామానికి చెందిన బూర్గుల యువరాజు (40) మరణించారు. విషయం తెలుసుకున్న 2000-01 పదవ తరగతి మిత్ర బృందం రూ. 45 వేలు వారి కుటుంబ సభ్యులకు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపత్కాలంలో స్నేహితుడు కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యారా సురేష్, రంగు రాజు,రఘుసాల శివాజీ, యారా నర్సిరెడ్డి, మేదరి సురేష్, రాయపూరి నవీన్, మురళి తదితరులు పాల్గొన్నారు.