మొగుళ్లపల్లి, జూన్23 : ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో అసహనం పెరిగింది. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే కాంగ్రెస్ సర్కారు భారీ వ్యతిరేకతను మూటగట్టుకుం ది’ అని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం మొగుళ్లపల్లిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు అధ్యక్షతన మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించగా, మాజీ ఎమ్మెల్యేతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ అనుభవం లేని, అసమర్థ, చేత గాని పాలన వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని, కేసీఆర్ పాలనలో తమ జీవితాలు అద్భుతంగా ఉన్నాయని వారు పునరాలోచించుకుంటున్నారన్నారు.
ఎన్నిక ఏదైనా ఎగిరేది గులాబీ జెండేనన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెడుతోందన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అక్రమ కేసులకు బయపడేది లేదని, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు. బీఆర్ఎస్ ప్రభు త్వం గూడు లేని నిరుపేదకు ఇల్లిస్తే నేడు కాంగ్రెస్ నాయకులు ఇల్లు రాక ముందే లక్ష ల్లో వసూలు చేస్తున్నారన్నా రు. గండ్ర జ్యోతి మాట్లాడు తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తూ స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచేలా కృషి చేయాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. కాగా, గుండ్లకర్తి గ్రామ మాజీ సర్పంచ్ గూడెపు శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. అలాగే బంగ్లపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కరాబ్ రజిత భర్త యువరాజ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ జోరుక సదయ్య, చిట్యాల వ్యవసాయ మారెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడారి రమేశ్, వరంగల్ వ్యవసాయ మారెట్ కమిటీ డైరెక్టర్ పిన్నింటి వెంకట్రా వు, తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి, సర్పంచుల ఫోరం మండల మాజీ ఉపాధ్యక్షుడు దానవేని రాములు, మాజీ సర్పంచ్ నైనకంటి ప్రభాకర్‌రెడ్డి, సీనియర్ నాయకులు నరహరి వెంకట్‌రెడ్డి, బెల్లంకొండ శ్యాంసుం దర్‌రెడ్డి, కరాబ్ మలహల్ రావు పాల్గొన్నారు.