జఫర్గడ్ : జఫర్గడ్ మండలంలోని ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను(Revenue conferences) రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ శంకరయ్య సూచించారు. జఫర్గడ్లోని రైతు వేదికలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం గ్రామ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
భూభారతి( Bhubharati ) ద్వారా భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించు కోవచ్చన్నారు. రైతులు తమ భూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 197 మంది దరఖాస్తులు ఇచ్చినట్లు శంకరయ్య తెలిపారు. కార్యక్రమంలో డీటీ అనిల్ బాబు, ఆర్ఐలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
RCB victory parade | ఆర్సీబీకి షాక్.. విక్టరీ పరేడ్ రద్దు
Siddhu Jonnalagadda | ‘జాక్’ డిజాస్టార్.. రూ. 4 కోట్ల రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చిన హీరో!